టిడిపి అధికారంలోకి రాగానే డప్పు కళాకారుల పెన్షన్లు పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం తాడిపత్రి నియోజకవర్గంలో తనను కలిసిన డప్పు కళాకారులతో లోకేష్ సంభాషించారు. వారి సమస్యలను విన్న లోకేష్ వాటిపై సానుకూలంగా స్పందించారు.
50 ఏళ్లు నిండిన దళిత డప్పు కళాకారులకు టిడిపి ప్రభుత్వం లో పెన్షన్ ఇచ్చామని లోకేష్ చెప్పారు. జగన్ సిఎం అయిన తర్వాత దళితులపై కక్ష సాధిస్తున్నాడన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన అనంతరం దళితులకు అండగా నిలబడతామని చెప్పారు.