2024 లో దూదేకుల ముస్లీంలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం తాడిపత్రి నియోజకవర్గం పెదపప్పూరు శివార్లలో దూదేకుల ముస్లిం ప్రతినిధులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. దూదేకుల ముస్లీంలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చింది టిడిపి. 1999 నాగుల్ మీరాకి ఎమ్మెల్యే సీటు ఇచ్చాం. చమన్ కి జెడ్పీ ఛైర్ పర్సన్ పదవి ఇచ్చింది టిడిపి. నాగుల్ మీరాకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ పదవి ఇచ్చింది టిడిపి అని లోకేష్ వివరించారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దూదేకుల ముస్లీంలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం. నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లో దూదేకుల ముస్లీంలకి ప్రత్యేకంగా భూములు కేటాయిస్తామని చెప్పారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం ద్వారా దూదేకుల ముస్లీంలకు పనిముట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. టిడిపి హయాంలో నూర్ బాషా ఫెడరేషన్ ఏర్పాటు చేసి 40 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు చెప్పారు. వైసిపి నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదు. ఒక్క రుణం ఇవ్వలేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.
వక్ఫ్ భూములు కాపాడటానికి వక్ఫ్ బోర్డు కి జ్యుడిషియల్ పవర్ కల్పిస్తామని వెల్లడించారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం అని జగన్ మోసం చేశారన్నారు. దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. హజ్ హౌస్ లు నిర్మించింది టిడిపి. హజ్ యాత్రకు సహాయం చేసింది టిడిపి. ఉర్దూ యునివర్సిటీ ఏర్పాటు చేసింది. ఉర్దూ టీచర్ పోస్టులు భర్తీ చేసింది టిడిపి.రంజాన్ తోఫా ఇచ్చింది టిడిపి, దుల్హన్ పథకం, దుకాన్ మకాన్ కార్యక్రమం అమలు చేసింది టిడిపి. మసీదులు, ఈద్గా ల అభివృద్ది కి నిధులు కేటాయించింది టిడిపి. ఖబర్ స్తాన్ లు అభివృద్ది చేసింది టిడిపి అని లోకేష్ వివరించారు. ఎవరి హయాంలో మైనార్టీలకు న్యాయం జరిగిందో చర్చకు నేను సిద్దం డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు సిద్దమా? అని ప్రశ్నించారు.
జగన్ పనైపోయింది. ప్రజలు భయం నుండి బయటకి రావాలి అని పిలుపునిచ్చారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత మైనార్టీలను మోసం చేసింది. ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం ద్వారా దూదేకుల ముస్లీంలకు పనిముట్లు అందజేస్తామని చెప్పారు. ఆఖరికి స్మశానం భూముల్ని కూడా వైసిపి నాయకులు కబ్జా చేస్తున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దూదేకుల ముస్లీం లు ఎక్కువ ఉండే గ్రామాల్లో ప్రత్యేక ఖబర్ స్తాన్ లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దూదేకుల ముస్లీం విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని ప్రకటించారు. బిజెపి తో పొత్తులో ఉన్నా టిడిపి ముస్లీంలను ఏనాడూ చిన్న చూపు చూడలేదు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లీం లను వేధించి చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి చంపేశారు. మిస్బా అనే 10 తరగతి అమ్మాయిని వైసిపి నేత వేధించి చంపేశాడని ఆరోపించారు.
తాడిపత్రిని అభివృద్ధి చేసిన జెసి
తాడిపత్రిని జేసీ కుటుంబం అద్భుతంగా అభివృద్ది చేసిందని లోకేష్ ప్రశంసించారు. గతంలో తాడిపత్రి వచ్చి మున్సిపల్ కార్యాలయం చూసినప్పుడు నేను ఆశ్చర్యానికి గురయ్యాను. కార్పొరేషన్ కి కూడా అంత అద్భుత భవనం ఉండదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించరాని చెప్పారు. కానీ ఇంకా ఏదో వస్తుంది అని ఆశించి పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారన్నారు. అప్పుడు అభివృద్ది లో నంబర్ 1 గా ఉన్న తాడిపత్రి ఇప్పుడు అవినీతి లో నంబర్ 1 గా ఉంది. అప్పుడు తాడిపత్రి ఎలా ఉంది. ఇప్పుడు తాడిపత్రి లో ఏం జరుగుతుంది ఒక్క సారి ప్రజలు ఆలోచించాలని కోరారు. నాపై 20కి పైగా కేసులు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి గారిపై 70 కేసులు ఉన్నాయి. అయినా ప్రజల తరపున పోరాడుతున్నామని చెప్పారు.