టిడిపి అధికారంలోకి రాగానే దామాషా ప్రకారం ఎస్సీ ఉప కులాలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం మహాజన సోషల్ సమైక్యతా సంఘం ప్రతినిధులు లోకేష్ ను కలిసి వారి సమస్యలు వివరించారు.
ఎస్సీ వర్గీకరణ అమలుచేసి, మాదిగలకు న్యాయం చేయాలి.
గత ప్రభుత్వంలో అమలుచేసిన రైతులకు భూమి కొనుగోలు పథకం, బోర్లు, ఉచిత విద్యుత్, ఎన్ఎస్ఎఫ్ డిసి బ్యాంకు లికేజి పునరుద్దరించాలి.
ప్రస్తుత ప్రభుత్వం 1998 డిఎస్సీ టీచర్ పోస్టుల భర్తీలో రోస్టర్ పాయింట్ అమలుచేయలేదు. దీంతో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది.
కర్నూలు 23వవార్డు శ్రీరామ్ నగర్ సుద్దవంక వరద నీరు కాలనీలోకి ప్రవహిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు ఈ కాలనీలో అత్యధికంగా ఉన్నందున ఫ్లడ్ వాల్ నిర్మించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు అమలుచేసిన 27సంక్షేమ పథకాలను రద్దుచేసిన దళిత ద్రోహి జగన్ రెడ్డి.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.33,504 కోట్లను జగన్ దారి మళ్లించారు.
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్దరిస్తాం.
సుద్దవంక వద్ద రక్షణగోడ నిర్మించి శ్రీరామ్ నగర్ కాలనీవాసులకు ముంపు బారినుంచి విముక్తి కల్పిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.