పోరుమామిళ్ల చెరువు వలన 1200 ఎకరాలు మునిగిపోయాయి. రైతులకు ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదు.
చెరుకు రైతులను జగన్ ప్రభుత్వం హింసిస్తుంది. బెల్లం అమ్మడానికి వీలు లేదని కేసులు పెడుతున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయం లో యువత ను ఎక్కువ గా ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు.
ఉపాధి హామీ ని హార్టి కల్చర్ కి అనుసంధానం చెయ్యాలి.
సోమశిల ముంపు బాధితులకు న్యాయం చెయ్యలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకోవాలి. వైసిపి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఎంపి అవినాష్ రెడ్డి మోసం చేసాడు.
సోమశిల నుండి బద్వేల్ కి నీటిని కేటాయిస్తూ టిడిపి ప్రభుత్వం ఇచ్చిన జీఓ ని జగన్ ప్రభుత్వం అమలు చెయ్యడం లేదు.
వైసిపి అధికారంలోకి వచ్చిన డ్రిప్ ఇరిగేషన్ లేక మెట్ట రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నాం.
బద్వేలు నియోజకవర్గం రైతులు
రితీష్ రెడ్డి
20 వేల ఎకరాలు మాత్రమే సాగు లో ఉన్నాయి.
83 చెరువులు ఉన్నాయి కానీ నీరు లేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షా డెబ్బై వేల ఎకరాలు సాగు లోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి.
లోవర్ సీలేర్ ప్రాజెక్టు ఆధునీకరణ చేస్తానని హామీ ఇచ్చిన జగన్ మోసం చేసాడు.
లోకేష్ మాట్లాడుతూ
రాయలసీమ రైతులకు నీరు ఇస్తే బంగారం పండిస్తారు
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తీసుకొస్తాం.
జగన్ పాలనలో రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందులతో ఇబ్బంది పడుతున్నారు.
జగన్ పాలనలో విపరీతంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల రేట్లు పెరిగిపోయాయి.
రాయలసీమ కి జీవనాడి డ్రిప్ ఇరిగేషన్. అలాంటి డ్రిప్ పై సబ్సిడీ ఎత్తేసి నాలుగేళ్లలో రైతులకి తీరని అన్యాయం చేశాడు జగన్.
రాయలసీమ ప్రాజెక్టుల కోసం టిడిపి ఖర్చు చేసింది 11,700 కోట్లు . అందులో 10 శాతం కూడా జగన్ ప్రభుత్వంలో ఖర్చు చెయ్యలేదు.
49 మంది ఎమ్మెల్యేలను రాయలసీమ లో గెలిపిస్తే జగన్ రాయలసీమకి ఇచ్చింది ఎంటి?
వైసిపి కి 2019 లో ఇచ్చిన సీట్లు మాకు ఇవ్వండి రాయలసీమ ని అభివృద్ది చేసి చూపిస్తాం.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు కు గ్యారెంటీ పేరుతో అన్నదాత కు 20 వేల ఆర్ధిక సాయం చేస్తాం.
ఒకే సంతకంతో 50 వేల లోపు ఉన్న రుణాలు అన్ని మాఫీ చేసింది చంద్రబాబు గారు.
ఇన్పుట్ సబ్సిడీ, రైతు రథాలు, డ్రిప్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసింది టిడిపి.
హార్టి కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది టిడిపి ప్రభుత్వం.
పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించింది చంద్రబాబు.
పులివెందులకు నీళ్లు ఇచ్చింది చంద్రబాబు. 175 నియోజకవర్గాలు నాకు సమానం అంటూ అభివృద్ది చేసాం.
పంటల భీమా పక్కగా అమలు చేసింది టిడిపి.
జగన్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపి దేశంలోనే నంబర్ 3 గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 గా ఉంది.
టిడిపి హయాంలో ఒక్కో రైతు మీద రూ.75 వేల అప్పు ఉంటే జగన్ పాలనలో రూ.2.50 లక్షలకు చేరింది.
ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి కోర్టు దొంగ.
పంట నష్టం జరిగితే కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు జగన్ ప్రభుత్వం లో లేదు.
గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం ద్వారానే శాశ్వతంగా సాగునీటి సమస్య తీరుతుంది.
లోవర్ సీలేరు ప్రాజెక్టు ని ఆధునీకరణ చేస్తానని జగన్ బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా హామీ ఇచ్చి మోసం చేసాడు.
ముంపు కి గురై భూములు కోల్పోయిన రైతులను ఆదుకుంటాం.
బద్వేల్ లో టిడిపి జెండా ఎగరేయండి పెండింగ్ ప్రాజెక్టులు, బ్రిడ్జ్ పనులు పూర్తి చేసే బాధ్యత నాది.
జగన్ సొంత బ్రాండ్లు అమ్ముకోవడానికి చెరుకు రైతులను వేధిస్తున్నాడు.
బెల్లం అమ్మడానికి వీలు లేదని అక్రమ కేసులు పెడుతుంది జగన్ ప్రభుత్వం.
గతంలో ఎలా అయితే స్వేచ్ఛగా బెల్లం అమ్ముకునే వారో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే స్వేచ్ఛగా రైతులు బెల్లం అమ్ముకునే అవకాశం కల్పిస్తాం.
బద్వేల్ నియోజకవర్గం లో సాగునీటి కష్టాలు తీర్చడానికి పిల్ల కాలువలు తవ్వుతాం.
మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాయలసీమ లో హార్టి కల్చర్ ని ఎక్కువుగా ప్రోత్సహిస్తాం.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తాం.
మామిడి, దానిమ్మ, బొప్పాయి, చీనీ, కర్జూరం ఇలా వీటిలో అనేక రకాల మొక్కలు ఇక్కడే పెంచే విధంగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.
జూస్ ఫ్యాక్టరీలు రావడానికి కావాల్సిన రకాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటాం.
పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి యువత వ్యవసాయం వైపు వచ్చేలా చేస్తాం.
పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, సెరీ కల్చర్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ ని హార్టి కల్చర్ కి అనుసంధాన చేసి పంట కుంటలు, మినీ గోకులం లాంటి అనేక కార్యక్రమాలు అమలు చెయ్యడానికి అనుసంధానం చేసాం.
సోమశిల ప్రాజెక్టు ముంపు బాధితులకు అన్యాయం జరిగింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తాం. మొదటి 18 నెలల్లో పరిహారం అందిస్తాం.
బద్వేల్ నియోజకవర్గం లో పెండిగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అదనంగా మరో 80 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
ఇసుక దోపిడి లో జే ట్యాక్స్ రోజుకి రూ.3 కోట్లు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కుందూ ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.