యూత్ పవర్ కి ప్యాలస్ పిల్లి భయపడింది. యువగళాన్ని అడ్డుకోవడానికి పోలీసుల్ని పంపాడు.. మనం ఆగలేదు. యువగళాన్ని తొక్కేయండని సైకోలను పంపాడు.. మనం తగ్గలేదు. ఆఖరికి పీకేది ఏమి లేక కోడికత్తి బ్యాచ్ ని పంపి కోడిగుడ్డు వేయించాడు. కోడిగుడ్డు వేసిన వాడి మొఖం మీద మన వాళ్లు రిటర్న్ గిఫ్ట్ గా ఆమ్లెట్ వేసి పంపారు. ప్యాలస్ పిల్లి దాక్కొని దాడులు చేయిస్తుంది. దమ్ముంటే నువ్వే రా జగన్ తేల్చుకుందాం. భయం మా బయోడేటాలో లేదు బ్రదర్. సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర. అడ్డొస్తే ఆగిపోయేవాడిని కాదు. అడ్డొచ్చినవాడిని తొక్కుకుంటూ పోయే ఫైటర్ ని. మీ లోకేష్ ది అంబేద్కర్ గారి రాజ్యాంగం.. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం. మీ లోకేష్ ది లోకల్… జగన్ ది ప్యాలస్. మీ లోకేష్ ది యువగళం… జగన్ ది పరదాల బ్రతుకు. మీ లోకేష్ అందరి వాడు.. జగన్ అమ్మని, చెల్లిని గెంటేసిన వాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్ చేసింది ఏంటి? సాధించింది ఏంటి? ఏపీని పాత బీహార్ లా మార్చేసాడు.
జగన్ మొదట దళితుల పై దాడులు చేయించాడు. దళితుల్ని చంపాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు మేము దళితులం కాదులే అని మౌనంగా ఉన్నారు. అప్పుడు జగన్ మైనార్టీల పై దాడి చేసాడు. మైనార్టీలను చంపాడు. మైనార్టీలను చంపితే మనకెందుకులే అని అంతా అనుకున్నారు. అప్పుడు జగన్ కన్ను బీసీల పై పడింది. బీసీలను వేధించడం మొదలు పెట్టాడు. బీసీలపై కదా అని ఇతర వర్గాలు సైలెంట్ గా ఉన్నాయి. మనల్ని కాదు కదా అని ఎవరూ మాట్లాడలేదు, ఎవరూ పోరాడలేదు. ఎవరూ మాట్లాడటం లేదు కదా అని జగన్ ఇప్పుడు మహిళల్ని, పిల్లల్ని కూడా వదలడం లేదు. అందరినీ అంతం చేస్తున్నాడు. చంపేసి ప్రాణానికి ఖరీదు కడుతున్నాడు. రేప్ జరిగితే మానానికి విలువ కడుతున్నాడు. గంటకో హత్య.. పూటకో రేప్… కిడ్నాప్. అడుగడుగునా దౌర్జన్యాలు.. ప్రతీ ఊరిలోనూ కబ్జాలు.. గంజాయి.. నేరగాళ్లు చెలరేగిపోతుంటే ఏ ముఖ్యమంత్రి అయినా డిజిపితో సమీక్ష నిర్వహించి నేరాలు కట్టడి చేయాలని ఆదేశిస్తారు. కానీ జగన్ మాత్రం తియ్యబోయే సినిమా పై రామ్ గోపాల్ వర్మ తో సమీక్షా సమావేశం పెట్టుకున్నాడు.