` మంత్రి మండిపల్లి స్ఫూర్తిదాయకమైన చొరవ తీసుకున్నారు
` ఎక్స్‌లో విద్య, ఐటీశాఖల మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): యువత మన భవిష్యత్తుకు రూపశిల్పులు అని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం నాడు, ఆంధ్రప్రదేశ్‌లోని యువతీ, యువకులు.. రవాణా, యువజన, క్రీడల మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి స్ఫూర్తిదాయకమైన చొరవతో ప్రారంభించిన ఆంధ్రా యువ సంకల్ప్ 2కే25లో చేరాలని పిలుపు ఇచ్చారు. వికసిత్ భారత్`2047 లక్ష్యసాధనకు యువశక్తిని మళ్లించి, వారికి సాధికారత కల్పించే విజన్‌తో ఈ డిజిటల్ మారథాన్‌ను రూపొందించారన్నారు. ఆంధ్రా యువ సంకల్ప్ 2కే25 ప్రధానంగా.. ఏఐ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్, ఫిట్‌నెస్, జీవనశైలి, పోషకాహారం, క్రీడలు, సామాజిక బాధ్యత, కుటుంబ సంబంధాలపై దృష్టి పెడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ యువతలో నైపుణ్యాలను మెరుగు పరచి, వారిని బలోపేతం చేసేలా స్ఫూర్తిని నింపుదామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.