- శాంతి, భద్రతలపై ఆ పార్టీ మాట్లాడటం హాస్యాస్పదం
- బాబాయ్ హత్య పునాదిగా అధికారంలోకి జగన్
- ఆయన పాలనలో తల్లి, చెల్లికే రక్షణ కరువు
- అందుకే రాష్ట్రం వదిలి పారిపోయారు
- ఉనికి కోసమే వైసీపీ నేతల అసత్య ప్రచారం
- మంత్రి అనగాని ధ్వజం
అమరావతి(చైతన్యరథం); వైసీపీ నేతలు శాంతిభద్రతల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రెవెన్యూ, స్టాంపు లు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్ హయాం లో సొంత తల్లి, చెల్లి, కుటుంబ సభ్యులకు రక్షణ లేక రాష్ట్రం వదిలి పోయారని గుర్తు చేశారు. సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్చసి 48గంటలు దాచిపెట్టిన చరిత్ర వైసీపీది. ఇప్పుడు వైసీపీ నేతలు శాంతి భద్రతల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉంది. వైసీపీ నేతల డీఎన్ఏలోనే హత్యా రాజకీయాలు ఉన్నాయి. బాబాయ్ ని హత్య చేసి అధికారంలోకి వచ్చిన జగన్కు, వైసీపీ నేతలకు హత్యా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదు. సత్య హరిచంద్రుడి కన్నా వైసీపీ నేతలే నిజాయితీపరులు అన్న విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పేర్ని నాని వంటి కొందరు వైసీపీ నాయకుల రాజకీయ జీవితం ఎప్పుడో ముగిసిపోయి, షెడ్ లో పనికిరాని వాహ నాల్లా మారారు. అందుకే, టీవీలు, పత్రిక ల్లో కనిపించేందుకు అసత్యాల స్క్రిప్ట్తో నీచమైన రాజకీయ డ్రామాలు ఆడుతున్నా రు.
రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తీసుకురాలేని కోడిగుడ్డు మంత్రిగా పేరు తెచ్చుకున్న వైసీపీ నేత కూడా మాట్లాడు తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. వీరి రోజువారీ కార్యక్రమం ఒకటే. తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ను అనుసరించి అసత్య ప్రచారాలు చేయడం, రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్ల డం, మేము బతికే ఉన్నామని చెప్పు కోవ టం. నీచ రాజకీయాలు వైసీపీ వారసత్వం లోనే ఉన్నాయి. బాబాయ్ ని గొడ్డలితో నరికిన ఘటన నుంచి గులక రాయి డ్రా మాల వరకు, వైసీపీ రాజకీయ నాటకాలు చూసి రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు. టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించి పేదల కళ్ళలో ఆనందం చూస్తే. వైసీపీ నేతలు మాత్రం రుషికొండ ప్యాలస్ కట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూశారు. ఇది పెత్తందారి పోకడలకు నిదర్శనం SCP? రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం, ప్రజలకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. వైసీపీ మార్క్ అరాచకాలు, అక్రమాలు, హత్య రాజకీయాలకు చరమగీతం పాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అనగాని స్పష్టం చేశారు.