అమరావతి (చైతన్యరథం): మానవత్వానికి మించిన సంపద లేదని చాటి చెప్పిన కరుణామూర్తి మదర్ థెరిసా అని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు. మంగళవారం ఆమె జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. కష్టాల్లో ఉన్నవారికి, పేదలకు, అభాగ్యులకు సేవ చేయడాన్నే పరమావధిగా భావించి, జీవితం మొత్తం సేవకే అంకితం చేసిన సేవామూర్తి మదర్ థెరిసా అన్నారు. ఆ దయామయి స్మృతికి ఘననివాళులు అర్పిస్తున్నానన్నారు.