- పోలీసులు నిందితుడికి అండగా ఉన్నారు
- కంచికచర్ల చెందిన బాధిత మహిళ ఆవేదన
- న్యాయం చేయాలని ప్రజావినతుల్లో ఫిర్యాదు
మంగళగిరి(చైతన్యరథం): కంభం గ్రామానికి చెందిన వెంకట రాంభూపాల్‌రెడ్డి అనే వ్యక్తి తన ఫోన్‌ను హ్యాక్ చేసి తన, తన కుటుంబ ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ లైంగికంగా బెదిరిస్తున్నాడని కంచికచర్ల చెందిన బాధిత మహిళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. తన వద్ద నుంచి రూ.7 లక్షలు తీసుకోవడమే కాకుండా రోడ్డుపై వెళుతుండగా తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. దీనిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా నిందితుడిపై చర్యలు తీసుకోకపోగా మహిళలను వేధిస్తున్న వ్యక్తికి పోలీసులు అండగా ఉన్నారని గోడు వెళ్లబోసుకుంది. వెంటనే రాంభూపాల్‌రెడ్డిని అరెస్టు చేయాలని కోరింది. మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె.ఎస్.జవహర్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అర్జీని స్వీకరించి న్యాయం జగిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
` తాను టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నానన్న కారణంతో తనపై గత ప్రభుత్వంలో బొల్లా బ్రహ్మనాయుడు అనుచరులు పగబట్టి తమ ఇంటిపైకి దాడికి వచ్చి కర్రలు, రాడ్లతో ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేసి తమను కొట్టి చంపేస్తామని బెదిరించారని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానిబాషా ఫిర్యాదు చేశాడు. తమపై దాడి చేసిన పి.ఎస్.ఖాన్‌తో పాటు మిగిలిన వారందరిపై కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని కోరారు.
` తన సోదరుడి భార్యను వైసీపీ నేతలు టీజ్ చేయడంతో ప్రశ్నించిన తన తమ్ముడు లింగాల లక్ష్మీనారాయణపై దాడి చేసి కాళ్లు విరగ్గొట్టారు..ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా నాడు పట్టించుకోలేదని పల్నాడు జిల్లా కారంపూడి మండలానికి చెందిన లింగాల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశాడు. తాము టీడీపీ అనుకూలంగా ఉండటంతోనే కేసును నీరుగా ర్చారని..తన తమ్ముడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
` గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సహకారంతో పలువురి దళితులను తమపైకి ఉసిగొలిపి టీడీపీకి ఓట్ల పడకుండా పోలింగ్ బూత్‌లో ఘర్షణకు దిగి తమపైనే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారని అన్నమ య్య జిల్లా చిట్వేలి మండలానికి చెందిన కాకర్ల సుబ్బరాయుడు ఫిర్యాదు చేశాడు. విచారించి తమపై అక్రమ కేసును రద్దు చేసేలా చూడాలని విన్నవించాడు.
` ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం సీతారామపురం గ్రామంలో 2018 -2019న వీధిలైట్ల ఏర్పాటు, పీడబ్ల్యూడీ పనులు, పారిశుధ్య పనులు, ఇంకా వివిధ పనులకు తనకు రావాల్సిన రూ.6.80 లక్షలు నేటికీ రాలేదని.. తనకు రావాల్సి న డబ్బులు ఇప్పించాలని మాజీ సర్పంచ్ బాణావత్తు రాములు విజ్ఞప్తి చేశాడు.
` తాము గతంలో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూమిలో గ్రామస్తులు కొందరు తమకు దారి ఉందని పంట ను ధ్వంసం చేస్తున్నారని ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామానికి చెందిన పిచ్చయ్య ఫిర్యాదు చేశాడు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే పట్టించుకోవడం లేదని తెలిపారు. ఆ భూమిలో ఎటువంటి బాట లేదని రెవె న్యూ అధికారులు తేల్చి చెప్పినా పంటను ధ్వంసం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
` డక్కిలి గ్రామానికి చెందిన సాయిప్రసాద్, అతని స్నేహితుడు తన వద్ద రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశారని.. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని నెల్లూరు జిల్లా సైదాపురం మండలం వేములచేడు గ్రామానికి చెందిన దాసరి గాయత్రి ఫిర్యాదు చేసింది.
` గత ప్రభుత్వంలో తమ పేరిట మంజూరైన హౌసింగ్ రుణం డబ్బులను మరొకరికి ఇచ్చి తమను అధికారులు మోసం చేశారని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామానికి చెందిన ముల్లా ఖాతూన్ బీ ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యానికి వస్తున్నారని తెలిపారు. మోసగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.