అమరావతి (చైతన్యరథం): దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన సేవలు నిరుపమానం అని కొనియాడారు. దేశ భవిష్యత్ జలాశయాలే అని నమ్మి తాగు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. తన ప్రతిభతో నవ భారత నిర్మాణానికి కృషిచేశారు. ఇంజనీర్లకు మార్గదర్శి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.