- 120 గ్రామాల్లో డీబీఎన్) స్కీమ్ కింద టవర్లు
- డిజిటల్ ఇండియాకు లక్ష్యాలే ఉద్దేశం
- కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు(చైతన్యరథం): రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభు త్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పెమ్మసాని క్యాంప్ కార్యాలయంలో ఇండస్ట్ అవర్స్ నిర్వాహకులు ఆదివారం సంప్రదించారు. టవర్స్ ఏర్పాటు తదితర అంశాలపై ఇబ్బందులను వివరించారు. సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 414 గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ లేదన్న విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే దీనిపై అత్యంత ప్రాధాన్యతతో చర్యలు ప్రారంభించినట్లు తెలిపా రు. 120 గ్రామాల్లో ఒక్క మొబైల్ టవర్ కూడా లేని పరిస్థితి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) స్కీమ్ కింద రూ.120 కోట్ల వ్యయంతో కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటు పనులు చేపట్టినట్లు వివరించారు. ఈ టవర్ల ఏర్పాటును తాను నిరంతరం సమీక్షిస్తున్నానని, డిసెంబర్ 2026 నాటికి పను లు పూర్తిచేయాలనే స్పష్టమైన గడువును నిర్ణయించినట్లు తెలిపా రు. ఇవేకాకుండా మిగిలిన 250కి పైగా గ్రామాల్లో టవర్లు ఉన్న ప్పటికీ ఒక్కటే టవర్ ఉండటం, గ్రామం మొత్తం నెట్వర్క్ కవర్ కాకపోవడం, ఒక్క కంపెనీ సేవలకే పరిమితమవడం వంటి సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఈ గ్రామాల్లో కనెక్టివిటీని మరిం త బలోపేతం చేసేందుకు ప్రైవేట్ టెలికాం సంస్థలు, ఇండస్ టవర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో కొత్త టవర్లు ఏర్పాటు చేసి సేవలను విస్తరించేందుకు ముందుకురావాలని వారిని ప్రోత్సహించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన మొబైల్ కనెక్టివిటీ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం, సమన్వయం అందిస్తామని స్పష్టం చేసినట్లు తెలిపారు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
















