అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తూర్పు గోదావరి జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబుకు నివేదిస్తూ.. అభివృద్ధిపై చర్చించారు. జిల్లాలో నీటి పారుదల సదుపాయాల మెరుగుదల, జాతీయ రహదారుల విస్తరణ, పర్యాటకరంగ అభివృద్ధి, గృహ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి, గండి పోచమ్మ తల్లి ఆలయాభివృద్ధి వంటి అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా సీఎంకు గండి పోచమ్మ తల్లి చిత్ర పటాన్ని సోము వీర్రాజు అందచేశారు.