అమరావతి (చైతన్యరథం): పులివెందులలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవటంతో ప్రజాస్వామ్యం గెలిచిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు వేశారన్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం… అంతేకానీ భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదని వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ చురకలు వేశారు.