అమరావతి (చైతన్యరథం): ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదరసోదరీమణులకు విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవనశైలి ఆదివాసుల సొంతం అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆదివాసీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిత్యం కృషిచేస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,557 కోట్ల నిధులను వారి సంక్షేమం కోసం వెచ్చించామని, భవిష్యత్ లోనూ గిరిజన సోదరులకు అన్ని విధాల అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.