అమరావతి(చైతన్యరథం): కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటుకు క్యాబినెట్లో ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమ వాసుల తరపున మంత్రి రాంప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్‌రెడ్డి గత ప్రభుత్వంలో చెప్పిన ఒక్క హామీ కూడా నీతి నిజాయితీతో ఎప్పుడూ అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెల్లలోనే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకో వడం ఆనందంగా ఉందన్నారు. జగన్ మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే..తమ నాయకుడు అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు.