అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. గురువారం ఉదయం ప్రకాశం జిల్లాకు వెళ్తున్న మంత్రి లోకేష్, అమ్మనబ్రోలులో ఇటీవల హత్యకు గురైన వీరయ్యచౌదరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. సాయంత్రం 3 గంటలకు గుంతకల్లు నియోజకవర్గం రామరాజుపల్లెలో ఉత్తమ కార్యకర్తలతో భేటీ అవుతారు. అనంతరం 4 గంటలకు రామరాజుపల్లిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. 16న శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటవుతున్న రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు జీఎంఆర్ కాంపౌండ్ అయ్యప్పస్వామి ఆలయం దగ్గర 80 ఫీట్లు రోడ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అనంతపురంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కుమార్తె వివాహానికి హాజరవుతారు. 17న ఉదయం 10 గంటలకు అనంతపురం జెఎన్‌టీయూ స్నాతకోత్సవానికి హాజరవుతారు.