అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో గెస్ట్ లెక్చరర్‌లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గంటకు ఇస్తున్న రూ. 150 పారితోషికాన్ని రూ.375కు పెంచగా, నెలకు గరిష్టంగా రూ.27,000గా నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తాజాగా విడుదలైన జీఓ లో తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని 475 జూనియర్ కాలేజీల్లో పనిచేసే 1177 మంది గెస్ట్ లెక్చరర్లు లబ్ధి పొందనున్నారు.