- చిత్రపటానికి పూలమాల వేసి నివాళి
- కుటుంబసభ్యులకు ఓదార్పు అండగా ఉంటామని హామీ
చంద్రగిరి (చైతన్యరథం): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో ఇటీవల మృతిచెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబాన్ని మంగళవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ చంద్రగిరి మండలం టీడీపీ అధ్యక్షుడిగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు విశేష సేవలందించారు. సుబ్రహ్మణ్యం నాయుడు నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.