హైదరాబాద్ (చైతన్యరథం) ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్లో ఏపీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్. ఘనంగా నివాళలర్పించారు. ఆయన సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. మంత్రి లోకేష్తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు తరలివచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘాటు పూలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ. జీవిత విశేషాలతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.















