ఉండవల్లి (చైతన్య రథం): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్ లాల్‌జీతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 2006-19 వరకు రామ్ లాల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా (సంస్థ), ఆర్ఎస్ఎస్లో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులతో ఆయన సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులతో భేటీ అయ్యారు. మంత్రి నారా లోకేష్ స్వయంగావెళ్లి రామ్ లాల్‌కు స్వాగతం పలికారు. దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు, సంస్థ విశిష్టతను ఈ సందర్భంగా రామ్‌లాల్ వివరించారు. అనంతరం రామ్‌లాల్‌ను మంగళగిరి శాలువాతో మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. బాలల రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎన్ఎండీ ఫరూఖ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డోలా బాల వీరాంజనేయస్వామి, సత్యకుమార్ యాదవ్, ఆనం రాంనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.











