మంగళగిరి (చైతన్యరథం): శివరాత్రి వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రథోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం నిర్వహించిన రథోత్సవంలో మంత్రి ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తుల శివనామ స్మరణ, అశేష జనసందోహం మధ్య రథాన్ని లాగారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
విశ్వేశ్వరస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవంలో పాల్గొన్న మంత్రి
మంగళగిరిలో వేడుక అనంతరం కృష్ణాయపాలెంలోని శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత శ్రీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విశ్వేశ్వర స్వామి వారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. అనంతరం విశ్వేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. తరువాత స్థానిక ప్రజలతో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.