అనంతపురం (చైతన్యరథం): పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు భారతసైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో మనదేశ సైన్య శౌర్యపరాక్రమాలకు అభినందనలు తెలిపేందుకు అనంతపురం నగరంలో శనివారం జరిగే తిరంగా యాత్రలో విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. నగరంలోని టవర్ క్లాక్ సెంటర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర జరగనుంది. ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొని భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.