అమరావతి (చైతన్యరథం): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్‌తౌక్ అల్ మర్రి, లులు ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ ఎం.ఎ, లులు ఫైనాన్షియల్ హోల్డింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అదీబ్ అహ్మద్‌తో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంతకుముందు సీఎం చంద్రబాబుతో కలిసి వారికి హృదయపూర్వక స్వాగతం పలికామని ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. భారతదేశంలో, ఆగ్నేయాసియాలో ఆంధ్రప్రదేశ్‌ను కీలకమైన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేసే విషయమై వారితో సమగ్రంగా చర్చించామన్నారు. ఐటీ, తయారీ, పర్యాటకం, అగ్రి బిజినెస్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలు కల్పించడంపైనా విస్తృతంగా చర్చలు జరిపామని లోకేష్ వెల్లడిరచారు.