- చినకాకానిలోని పునీత జోసెఫ్ చర్చికి అందజేత
- చర్చి ఫాదర్, సంఘ పెద్దల కృతజ్ఞతలు
మంగళగిరి (చైతన్యరథం): మంగళగిరి మండలం చినకాకానిలో నూతనంగా నిర్మిస్తున్న పునీత జోసెఫ్ చర్చికి రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో గ్రానైట్ అందజేశారు. చర్చి నిర్మాణానికి గ్రానైట్ అందించాలని స్థానిక నాయకుల ద్వారా నిర్వాహకులు, సంఘ పెద్దలు కోరగా మంత్రి లోకేష్‌ను స్పందించారు. చర్చి ఫ్లోరింగ్‌కు అవసరమైన రూ.7 లక్షల విలువ చేసే గ్రానైట్‌ను తన సొంత నిధులతో కొనుగోలు చేయించి ఆదివారం స్థానిక నాయకుల ద్వారా చర్చి నిర్వాహకులకు అందజేయించారు. ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు, సంఘ పెద్దలు మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. చర్చి ఫాదర్ చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేష్ ఎన్నికలకు ముందే చర్చి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చారని, ఆ మాట ప్రకారమే గ్రానైట్ అందజేసి మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, యేసుప్రభు కృపతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు గుమ్మా హరిబాబు, ఉపాధ్యక్షుడు పలగాని వెంకట నాగబాబు, పొన్నెకంటి సాంబశివరావు, నక్కా సాంబశివరావు, చాగర్లమూడి నరేంద్ర, ఆకురాత్రి సాంబశివరావు, పలగాని గంగాధర్ రావు, బొర్రా కిరణ్ కుమార్, కుక్కమళ్ళ శ్రీనివాసరావు, మల్లవరపు కోటేశ్వరావు, మల్లవరపు చినబాబు, ఈపూరు మరియు దాసు, కొప్పాకల ఓంకార్, కటారి జోజి, పత్తిపాటి బాలయేసు, ఎండూరు సత్యనారాయణ, సంఘ పెద్దలు పాల్గొన్నారు.