మంగళగిరి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య ఆధ్వర్యంలో మంగళగిరిలోని తెనాలి రోడ్డు, బాప్టిస్ట్ చర్చి వద్ద జొన్నాదుల శ్రీనివాసరావు, జొన్నాదుల సాయికుమార్ నూతనంగా ఏర్పాటుచేసిన సాయిప్రియ హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు కూటమి నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య రిబ్బన్ కట్ చేసి షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజలో పాల్గొన్నారు. అనంతరం నందం అబద్దయ్య మనవడు జొన్నాదుల సాయికుమార్ దంపతులను ఆశీర్వదించారు. షోరూమ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తొలిగా మంగళగిరి చేనేత చీరను కొనుగోలు చేసి చేనేతల పట్ల తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. షోరూమ్ మొత్తం కలియతిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్‌విప్ పంచుమర్తి అనూరాధ, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానికీదేవి, తదితరులు పాల్గొన్నారు