అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ కుంభమేళాకు వెళ్తున్నారు. ఈనెల 17న సోమవారం ఉదయం ప్రయాగరాజ్‌కు చేరుకుంటారు. అక్కడ కుటుంబసమేతంగా మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అక్కడనుంచి సాయంత్రం 3.30 గంటలకు వారణాసి చేరుకొని కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.