మంగళగిరి (చైతన్యరథం): మన ఇల్లు – మన లోకేష్.. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా 8వ తేదీ మంగళవారం మొత్తం 554 మందికి విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా శాశ్వత ఇంటిపట్టాలు అందచేయనున్నారు. ఉదయం 10 గంటల నుండి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ జరుగుతుంది. ఉదయం రత్నాల చెరువు ప్రాంతానికి చెందిన 274 మందికి, మధ్యాహ్నం రత్నాల చెరువు ప్రాంతానికి చెందిన 254 మందికి, యర్రబాలెం గ్రామానికి చెందిన 26 మందికి మొత్తంగా 554 మంది లబ్దిదారులకు శాశ్వత ఇంటి పట్టాలు నారా లోకేష్ అందజేస్తారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది.