అమరావతి (చైతన్యరథం): శాసనసభ్యుల కోటానుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పార్టీ సీనియర్ నేత బీద రవిచంద్ర సోమవారం మర్యాద పూర్వకంగా విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా రవిచంద్రకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రజాసమస్యలను శాసనమండలి దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు.