అమరావతి (చైతన్యరథం): దివంగత ఎన్టీఆర్ తనయుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మృతిపట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. మామయ్య జయకృష్ణ సతీమణి, పద్మజ అత్త కన్ను మూశారన్న వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. అన్నివేళలా అండగా నిలిచే పద్మజ అత్త ఆకస్మిక మృతి తమ కుటుంబానికి తీరని లోటుగా పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.