- అడుగడుగునా శ్రేణులు, నేతల ఘన స్వాగతం
- పాలకొల్లులో గజమాల, శాలువాతో సత్కరించిన మంత్రి నిమ్మల
పాలకొల్లు (చైతన్యరథం): రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన ఈ వేడుకలో పాల్గొని కాబోయే దంపతులు శ్రీజ, పవన్ లను మంత్రి లోకేష్ ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకొల్లు చేరుకున్న మంత్రి నారా లోకేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేష్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పొత్తూరి రామాంజనేయ రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పశ్చిమగోదావరి జిల్లా లోసరి గ్రామం వద్ద తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్‌కు పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజానీకం స్వాగతం పలికారు. నర్సాపురంలో జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పొత్తూరి రామాంజనేయ రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు స్వాగతం పలికారు.