మార్కాపురం జిల్లా ఏర్పాటుపైనా వినతిపత్రం
అమరావతి(చైతన్యరథం): గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల విభ జన ప్రక్రియ అస్తవ్యస్తంగా చేపట్టిందని, నెల్లూరు జిల్లాలో ఉన్న కొండపి నియోజకవర్గంలోని పలు గ్రామాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి కోరా రు. జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పులపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమావేశంలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, బీసీ జనార్ధన్‌రెడ్డి, సత్యకుమార్ యాదవ్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. కొండపి నియోజకవర్గంలోని జరుగుమల్లి మండలం రామనాధపురం (ఎన్.వి.వి కండ్రిక) ఒక వీధి ప్రకాశం జిల్లా, మరొక వీధి పాలుకూరు పంచాయతీ నెల్లూరు జిల్లా పరిధిలో ఉందిని, దీనిని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నందన వనంలో కలపాలని కోరారు. జరుగుమల్లి మండలంలోని యడ్లూరి పాడు మండల కేంద్రానికి చాలా దూరంలో ఉందని, దీనిని పొన్న లూరు మండలంలో కలపాలని కోరారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆవశ్యతను మంత్రి స్వామి వివరించారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్ర గొండపాలెం పరిసర గ్రామాలు చాలా దూరంలో ఉన్నాయని, ఏదైనా పనుల మీద జిల్లా కేంద్రానికి ఈ ప్రాంత ప్రజలు రావా లంటే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే పశ్చిమ ప్రకాశం ప్రజలకు మేలు జరుగుందని తెలిపారు.