అమరావతి (చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ- ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో మెగా పీటీఎం 2.0 (తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం)ని విజయవంతం చేసిన అందరికీ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యాశాఖ, సమగ్ర శిక్షా అధికారులు, సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖలు, మీడియాతో పాటు ప్రజల సహకారంతోనే మెగా పీటీఎం 2.0 సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. స్వచ్ఛందంగా సమాజం అందించిన ఈ సహకారం విద్యా వ్యవస్థ వికాసానికి ఎంతో దోహదపడుతుందని మంత్రి లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.