రాజమండ్రి(చైతన్యరథం): ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్‌లోని అంతర్జాతీయ క్రీడా సముదాయం హల్ద్వానీలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగిన ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడల్లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో ఏపీ నుంచి ప్రాతి నిధ్యం వహించి రాజమండ్రి కుర్రోడు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కర్రి సాయిపవన్ కాంస్య పతకం సాధించాడు. గురువారం రాజమండ్రిలోని మంత్రి కార్యాల యంలో ఈ మేరకు కర్రి సాయిపవన్ తన తండ్రి కర్రి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కాంస్య పతకాన్ని చూపించారు. అనంత రం తన మెడలో పతకాన్ని మంత్రి చేతులమీదుగా మెడలో వేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తన క్రీడా ప్రతిభతో రాష్ట్రంతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు మంచి పేరు తీసుకురావడం గర్వంగా ఉందని పవన్‌తో పాటు తల్లిదండ్రులను అభినందించారు. క్రీడా రంగంలో పవన్ మరింత ఉన్నతస్థాయికి చేరాలని ఆశీస్సులు అందించారు. పవన్ ప్రతిఒక్క క్రీడాకారుడికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.