- రైతులు తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి
- వారికి మాత్రమే సబ్సిడీ విద్యుత్ వర్తిస్తుంది
- అసెంబ్లీలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి (చైతన్యరథం): చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికా ర సంస్థ సవరణ బిల్-2025కు శాసనసభఆమోదం తెలపడంపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. సీఎం చంద్రబాబు ఆక్వా రంగాన్ని జోన్, నాన్ జోస్ గా విభజించి అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఆక్వా రైతులు తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలి. వారికి మాత్రమే సబ్సిడీ విద్యుత్ యూనిట్ కు రూ.1.50 వర్తిస్తుందని వెల్లడిం చారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆక్వా పంటలకు జియో ట్యాగ్ చేసి చెరువులను గుర్తిస్తున్నామని వివరించారు. అసెంబ్లీలో ముమ్మడివరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని ఆక్వా రైతులకు సబ్సిడీలో 64,500 విద్యుత్ కనెక్షన్స్ లక్ష్యం కాగా.. ఇప్పటికీ 50,000 విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చామని తెలిపారు.
ఎమ్మెల్యేలు బాధ్యతగా తీసుకుని ఆక్వా
బిల్లు, రిజిస్ట్రేషన్ల గురించి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సబ్సిడీ విద్యుత్ అందచేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1100 కోట్లు ఖర్చు అవుతుంది. ఖర్చు ముఖ్యం కాదు.. ఆక్వా రంగాన్ని గాడిలో పెడుతున్నామన్న ఆనందం ముఖ్యమని తెలిపారు. రైతులకు లాభదాయకంగా ఉండేలా రైతులతో, ఆక్వా రంగ పెద్దలతో మాట్లాడి ఆక్వా చట్టాన్ని రూపొం దించాం. 20 శాతం మంది ఆక్వా రైతులు ఇప్పటివరకు రిజిస్ట్రే షన్ చేయించుకోలేదు.. వారి కోసం 50 శాతం లేట్ ఫీజ్తో మరో అవకాశం కల్పిస్తాం. ఆక్వా కల్చర్ బిజినెస్ ఆపరేషన్ లైసైన్స్ జీవితకాలం ఒక సంత్సర కాలం నుంచి 5 ఏళ్లు తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఆక్వా రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు, సబ్సిడీలు, మార్కెట్ అవకాశాల కల్పన, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని తెలిపారు.