- ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కల్యాణం
- పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు దంపతులు
ఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణం చూసేందుకు భారీసంఖ్యలో భక్తులు ఒంటిమిట్టకు చేరుకున్నారు. కల్యాణోత్సవం నిర్వహణకు తితిదే, జిల్లా యంత్రాంగం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. 52 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణ వేదికను ఏర్పాటు చేశారు. వేదికకు ఎదురుగా రెండువైపులా భక్తులు కూర్చోవడానికి 147 గ్యాలరీలు సిద్ధం చేశారు. భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు 13 భారీ ఎల్‌ఈడీ తెరలు అమర్చారు.