• సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం మార్లపల్లిమిట్ట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 800కుటుంబాలు నివాసముంటున్నాం.
• 150 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు లేవు, స్థలాలు ఇప్పించాలి.
• గ్రామంలో తాగునీరు వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నాయి, రెండుసార్లు అయినా ఇచ్చి నీటి సమస్యను పరిష్కరించాలి.
• టీడీపీ పాలనలో మా గ్రామంలో కరెంటు లైన్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం వాటికి మరమ్మతులు కూడా చేయించడం లేదు.
• మా గ్రామంలో వైసీపీ నేతలు అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు, అరికట్టాలి.
• మా గ్రామానికి సాగు, తాగు నీటి కోసం కొత్త పైపులైన్లు నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• ఇళ్లుకాదు, ఊళ్లు నిర్మిస్తున్నామని చెబుతున్న జగన్… నిజమైన నిరుపేదలను గాలికొదిలేశారు.
• ఇచ్చిన పనికిరాని స్థలాలను కూడా వైసిపి వారికే ఇచ్చుకున్నారు.
• వైసిపి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు.
• పంచాయతీలకు చెందిన రూ.8,600కోట్లను జగన్ దారిమళ్లించాడు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక ఇళ్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
• ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేసి, 24/7 తాగునీరు అందిస్తాం.
• అమాయకులపై తప్పుడుకేసులు పెట్టి వేధించే అరాచకశక్తులపై ఉక్కుపాదం మోపుతాం.