- సంక్షేమం, అభివృద్ధికి 2025 నాంది పలికింది
- విధ్వంసం నుంచి వికాసం వైపు గొప్ప మలుపు
- సంక్షోభాలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి
- 2026 అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలి
- సీఎం చంద్రబాబు నాయుడు
- ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నూతన సంవత్సరం సందర్భంగా పేదల ఇళ్లల్లో సంతోషం నింపేందుకు ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా ఇవ్వాల నేదే ప్రభుత్వ సంకల్పం.. ఇది చక్కగా అమలు చేశారని ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రభుత్వ అధికారు లకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, గ్రామ స్థాయి ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. పింఛన్లు అందుకున్న లబ్దిదారులకు, రాష్ట్ర ప్రజలకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.











