- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రిరకింగ్ వాటర్, స్టార్మ్ వాటర్ ప్రాజెక్ట్‌లపై దృష్టి
- మే నుంచి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించాలి
- సమాంతరంగా అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్ పనులు పూర్తిచేయాలి
- యూజీడీ, డ్రిరకింగ్ వాటర్ ప్రాజెక్ట్ డీపీఆర్‌లపై సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం
ఉండవల్లి (చైతన్య రథం): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రేనేజీ, డ్రిరకింగ్ వాటర్, స్టార్మ్ వాటర్ (వర్షపునీటి నిర్వహణ) ప్రాజెక్టులకు సంబంధించి మేలో పనులు ప్రారంభించి ఏడాదిన్నరలోగా పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించాలని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో యూజీడీ, డ్రిరకింగ్ వాటర్ ప్రాజెక్టుల డీపీఆర్‌లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పురపాలక మంత్రి పి.నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లను పకడ్బందీగా రూపొందించాలని, ప్రజలనుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లో అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలన్నారు.
ఆయా ప్రాజెక్టులతో పాటు సమాంతరంగా అండర్ గ్రౌండ్ గ్యాస్, పవర్ పనులు కూడా చేపట్టాలన్నారు. మంగళగిరి ప్రజలు నాపై బాధ్యత పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో మూడో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ మరియన్న, ఎంటీఎంసీ కమిషనర్ అలీమ్ బాష, ఏపీయూఐఏఎమ్‌ఎల్(యూజీడీ) రాజేష్ బాబు, డ్రిరకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ అశోక్ రాజు, సీఆర్డీయే డైరెక్టర్(టీపీ) వి.సునీత తదితరులు పాల్గొన్నారు.