• సంతనూతలపాడు నియోజకవర్గం మంచికలపాడు గ్రామానికి చెందిన దళితులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మేము ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన వాళ్లం.
• మా ప్రాంతంలో తాగునీరు కలుషితమై వస్తోంది.
• వీటిని మేం త్రాగడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతున్నాము.
• ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో మా ప్రాంతంలో 20మంది చనిపోయారు.
• మా ప్రాంతంలో ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేయాలి.
• మా గ్రామానికి శ్మశానవాటిక లేదు, మీరు అధికారంలోకి వచ్చాక శ్మశానాన్ని ఏర్పాటు చేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• గత ప్రభుత్వం దళితుల కోసం ప్రవేశపెట్టిన 27సంక్షేమ పథకాలను రద్దు చేసిన దళితద్రోహి జగన్ రెడ్డి.
• దళితుల అభివృద్ధి కోసం ఖర్చుచేయాల్సిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.28,147కోట్లు దారిమళ్లించి తీరని అన్యాయం చేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం.
• గ్రామంలో రోడ్లు, డ్రైనేజి, శ్మశానం ఇతర మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం.