- పరిశీలించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
- భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశం
- కోటప్పకొండ అభివృద్ధి ఘనత కోడెలదే
- రానున్నరోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం
- గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారని విమర్శ
అమరావతి(చైతన్యరథం): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో అత్యంత వైభవంగా జరిగే తిరునాళ్లకు పూర్తిస్థాయి ఏర్పా ట్లు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికు మార్ స్పష్టం చేశారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని శనివారం దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఫిబ్రవరి 26వ తేదీ జరిగే కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. దర్శనం క్యూలైన్లను పరిశీలించి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పారిశుధ్యం, తాగునీరు నిర్వహణను పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. కొండపైకి వెళ్లే మార్గంలో ఉన్న పిల్లల పార్క్, జంతు ప్రదర్శన శాల, బోటింగ్ పాయింట్లనూ పరిశీలించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దేవాలయ నిర్వహణ అస్తవ్యస్తమై భక్తులకు దర్శనం కూడా ఇబ్బందిగా మారిందని విమర్శించారు. భక్తులకు మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఎటువం టి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.
అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటుతో పాటు పిల్లల పార్క్, జంతు ప్రదర్శన శాల, బోటింగ్ పాయింట్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. మహాశివరాత్రి ఏర్పాట్లతో పాటు త్రికోటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని కూడా మంత్రి అడిగి తెలుసుకు న్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో జరిగే మహాశి వరాత్రి తిరునాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవని వెల్లడిరచారు. పండుగ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, దానికి అనుగు ణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కోటప్పకొండ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోడెల శివప్రసా ద్‌రావు కోటప్పకొండను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మరలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోటప్పకొండకు పూర్వవైభవాన్ని తెస్తున్నామని వెల్లడిరచారు. ఆయన వెంట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, అరవింద్ బాబు, కూటమి నేతలు పాల్గొన్నారు.