- అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులతో కొత్త రూపు
- నాగార్జునసాగర్, అహోబిలం, సూర్యలంకలో పనులు
- త్వరలోనే పట్టాలెక్కనున్న మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు
- డీపీఆర్‌ల ఆమోదానికి కేంద్ర మంత్రి సానుకూల స్పందన
- వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
- ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్‌లపై చర్చ
- కేంద్ర సాయంపై కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల
అమరావతి(చైతన్యరథం): రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించిన వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లను త్వరితగతిన ఆమోదించాలన్న మంత్రి కం దుల దుర్గేష్ అభ్యర్థనకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సాను కూలంగా స్పందించారు. మంగళవారం షెకావత్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెలగపూడి సచివాలయంలో తన పేషీ నుంచి మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వదేశీ దర్శన్ 2.0 కింద అభివృద్ధి చేయదలచిన నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన ఆమోదించాలని దుర్గేష్ కోరగా సానుకూలంగా స్పందించారు. మరో వారం పది రోజుల్లో సంబంధిత ప్రక్రియ చేపడతామని కేంద్రమంత్రి సమాధాన మిచ్చారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర పర్యాటక శాఖకు దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశీ దర్శన్ 2.0, శాస్కి స్కీమ్‌ల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా విశాఖపట్టణం జిల్లా సింహాచ లం ఆలయ అభివృద్ధి పనులు 60 శాతం పూర్తయ్యాయని, కాకినాడ జిల్లా అన్నవరం దేవాలయ అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొన్నాళ్లు పనులు నిలిచిపోనున్నాయని వివరించారు. స్వదేశ్ దర్శన్ 2.0 కింద బొర్రా గుహలు, లంబసింగి ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని ఇప్ప టికే బిడ్ వేసినట్లు చెప్పారు. శాస్కి స్కీమ్ కింద చేపడుతోన్న గండికోట ఫోర్ట్‌కు సంబ ంధించిన టెండర్లు ఇప్పటికే స్వీకరించినట్లు తెలిపారు. పర్యాటకులకు సాహసోపే తమైన అనుభవాలను కల్పించేందుకు సర్వత్రా సిద్ధమవుతుందని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు అభివృద్ధి ప్రక్రియ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని త్వరలోనే పట్టాలెక్కుతుం దని వెల్లడిరచారు.
అందులో భాగంగా పుష్కర్ ఘాట్, హేవలాక్ వంతెనల ఆధునికీకరణ చేపట్టనున్నట్లు వివరించారు. ప్రసాద్ స్కీం కింద సింహాచలం ఆలయ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని చెబుతూ ఇప్పటికే మంజూరైన రూ.54.04 కోట్ల నిధుల్లో తొలి విడతగా రూ.13.69 కోట్లు వినియోగించామని, మిగిలిన 2, 3వ విడత నిధులు త్వరితగతిన మంజూరు చేస్తే మరో 5 నెలల్లో పనులు పూర్తవుతాయని కోరారు. గతేడాది సెప్టెంబర్ 19న నెల్లూరు జిల్లాలోని వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించామని వాటిని కూడా పరిశీలించి ఆమోదించాలని కోరారు. అదేవిధంగా మంగళగిరి, అరసవెల్లి దేవాలయాల ప్రతిపాదన లను కూడా వీలైనంత త్వరగా ఆమోదిస్తే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి పరుగులు పెట్టి స్తామని ధీమా వ్యక్తం చేశారు. టూరిజం ఎండీ ఆమ్రపాలి మాట్లాడుతూ రాష్ట్ర టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే పర్యాటక ప్రాంతాలు నూతన శోభను సంతరించుని తద్వారా యువతకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయ అవకాశాలు చేకూరు తాయని వివరించారు.