అమరావతి (చైతన్యరథం): ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు అని, పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. శ్రీరామనవమి సందర్భంగా ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్ట్ చేశారు. ధర్మమార్గంలో నడిచిన వారికి శ్రీరాముడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని, ఈ శ్రీరామనవమి అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని.. శ్రీరామ చంద్రమూర్తి దయ రాష్ట్రంపూ ఉండాలని ఆకాంక్షిస్తూ.. మంత్రి లోకేష్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.