- నేడు మరో విడత పేదలకు పట్టాభిషేకం
- 624 మందికి శాశ్వత ఇంటిపట్టాల పంపిణీ
- తొలిదశలో మొత్తం 3 వేల మందికి పట్టాలు
- మార్కెట్ విలువ రూ.1000 కోట్లపైనే
- హామీల అమలు దిశగా అడుగులు
- మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్న లోకేష్
అమరావతి (చైతన్యరథం): మన ఇల్లు – మన లోకేష్..పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా సోమవారం 624 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ పంపిణీ చేయనున్నారు. ఉదయం 9 గంటల నుండి మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. ఉదయం కొలనుకొండ గ్రామానికి చెందిన 231 మందికి, పద్మశాలి బజార్‌కు చెందిన 127 మందికి పట్టాలు అందజేస్తారు. మధ్యాహ్నం పెనుమాక గ్రామానికి చెందిన 179 మందికి, ఉండవల్లి గ్రామానికి చెందిన 77 మందికి, ఇప్పటం గ్రామానికి చెందిన 10 మందికి మొత్తంగా 624 మంది లబ్దిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేస్తారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది.
లోకేష్ రాజకీయం..కేస్ స్టడీ
రాజకీయాల్లో విజయానికి దగ్గరి దారులు ఉండవు. ప్రజల అభిమానాన్ని పొందడం ద్వారానే విజయం సాధ్యమవుతుంది. ఆ ప్రజల అభిమానాన్ని పొందాలంటే కుల, మత, ప్రాంత భావనల నుంచి..రాజకీయ విద్వేష వాతావరణం నుంచి అందర్నీ బయటకు తెచ్చి.. రాజకీయం చేసేది మీ మంచి కోసమే అని మొదట వారికి నమ్మకం కలిగించాలి. మంత్రి నారా లోకేష్‌ను కేస్ స్టేడీగా తీసుకుంటే.. రాజకీయం ఎంత సక్సెస్ ఫుల్ గా చేయొచ్చో అర్థమవుతుంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన లోకేష్.. పార్టీ అధికారంలోకి వచ్చి మంత్రి పదవి చేపట్టిన తరువాత మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనుల విషయంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉండి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నారు. వీలైనన్ని సమస్యలు పరిష్కరించారు. అధికారంతోనే పరిష్కరించగలిగే సమస్యలకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని నెరవేరుస్తున్నారు. మంత్రిగా ఉన్నా.. పార్టీ బాధ్యతలు చేపడుతున్నా.. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీల జాబితాను పక్కన పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా పనులు చేపడుతున్నారు.
మంగళగిరిలో ప్రజలు వాకింగ్‌కు వెళ్లేంందుకు అటవీ పార్క్‌ను ఉపయోగించుకుంటారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఆ పార్క్‌లోకి వాకింగ్‌కు వెళ్లడానికి డబ్బులు కట్టాల్సి వస్తుందని ఫిర్యాదు చేశారు. దాంతో డబ్బులు కట్టకుండా వాకింగ్‌కు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అది చాలా చిన్న హామీ..కానీ గుర్తుంచుకుని ఆ హామీని ఇటీవల నెరవేర్చారు. ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోతే సొంత నిధులను ఇచ్చారు. ఇంత చిన్న హామీని లోకేష్ పక్కాగా గుర్తు పెట్టుకున్నారంటే.. ఇక పెద్ద హామీల పట్ల ఎలాంటి నిబద్ధత చూపిస్తారో చెప్పాల్సిన పని లేదు.
రెండున్నర దశాబ్దాల కల సాకారం
అందులో భాగంగానే మంగళగిరి నియోజకవర్గంలోని పేద ప్రజల రెండున్నర దశాబ్దాల కలను సాకారం చేస్తూ శాశ్వత ఇంటి పట్టాలను అందజేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ ప్రచారం చేస్తూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందజేసి మంగళగిరి పేద ప్రజల దశాబ్దాల కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 91 వేలకు పైగా భారీ మెజారిటీతో లోకేష్‌ను మంగళగిరి ప్రజలు గెలిపించారు. గెలిచిన తరువాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు లోకేష్ కార్యాచరణ మొదలుపెట్టారు. లోకేష్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ఇల్ల పట్టాల సమస్య. ఎన్నో ఏళ్లుగా పేద ప్రజలు ప్రభుత్వ భూముల్లో, కొండవాలులో నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వారంతా కష్టపడి, తినితినకా కష్టపడి తాము నిర్మించుకున్న ఇంటిని స్థలంతో సహా క్రమబద్దీకరించాలని దశాబ్దాలుగా ఎంతోమంది నాయకులను వేడుకుంటూనే ఉన్నారు. దీనిపై హామీలు ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందిన నాయకులెవరూ గెలిచిన తరువాత పట్టించుకున్న పాపాన పోలేదు.
అయితే ఇచ్చిన మాట తప్పని నాయకుడు లోకేష్ భారీ మెజారిటీతో తనను గెలిపించిన మంగళగిరి ప్రజల పట్ల తన నిబద్ధతను రుజువు చేసుకుంటూ పేదల ఇళ్లను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు చేసి విజయవంతమయ్యారు. మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేయించుకుని మొదటి దశలో 3 వేల మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందజేస్తున్నారు. వీటి విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.1000 కోట్లకు పైనే. అత్యంత క్లిష్టమైన అటవీ భూములు, రైల్వే భూముల సమస్యను కూడా పట్టుదలగా తీసుకుని పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ నెల 3 న మొదటి పట్టాను ఉండవల్లి గ్రామంలో నారా లోకేష్ స్వయంగా లబ్ధిదారుల నివాసానికి వెళ్లి అందజేశారు. ఉండవల్లిలో గత పదిహేనేళ్లుగా కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న రాజమండ్రి గోవిందు కుటుంబానికి మంత్రి లోకేష్ గురువారం ఇంటికెళ్లి బట్టలు పెట్టి శాశ్వత పట్టాను అందజేశారు. 4వ తేదీన యర్రబాలెం, నీరుకొండ, కాజా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు 546 మందికి మంత్రి లోకేష్ పట్టాలు అందజేశారు. కొందరు మహిళలు మంత్రి నారా లోకేష్ ఇళ్ళ పట్టాలు అందిస్తుంటే తీవ్ర భావోద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. మరికొందరు నారా లోకేష్‌ని మనసారా దీవించారు. రెండున్నర దశాబ్ధాలుగా ఈ భూపట్టాల కోసం పడిన పాట్లు గుర్తు చేసుకొంటూ చాలా మంది తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కాగా అభివృద్ధి పనుల విషయంలోనూ లోకేష్ ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదు. తన దృష్టికి వచ్చిన ప్రతి పనికి ఏదో విభాగం నుంచి నిధులు కేటాయించి పనులు చేయిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో చిన్నా..పెద్దా అనే తేడా లేకుండా చాలా పనులు జరుగుతున్నాయి. గ్రామాల్లో కొంత ఖర్చుతో పూర్తయ్యే చాలా పనులు వివిధ కారణాలతో పెండిరగ్‌లో ఉండిపోయాయి. వాటన్నింటికీ మోక్షం కల్పిస్తున్నారు.