- కమలాపురంలో వివిధ కార్యక్రమాలకు హాజరు
- అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
అమరావతి (చైతన్య రథం): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యకమాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కపడ పర్యటన నేపథ్యంలో సోమవారం రాత్రికే కడకు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, టీడీపీ కార్యకర్తలు కడప విమానాశ్రయానికి భారీగా చేరుకుని మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికారు. మంత్రి ఎస్ సవిత, పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులురెడ్డి, కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్ వరదరాజులురెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, పుత్తా చైతన్యరెడ్డి, ఆదినారాయణరెడ్డి, పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి తదితరులు మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే ప్రజలను కలుసుకున్న మంత్రి లోకేశ్, ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నేడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి లోకేశ్ పాల్గొంటారు.
ఉదయం 10.05కు సికె దిన్నె ఎంపిపి హైస్కూలులో అడ్వాన్స్‌డ్ మోడరన్ కిచెన్ సిస్టమ్ ప్రారంభిస్తారు. 10.20కి తరగతి గదులను సందర్శిస్తారు. 11.05కు పెండ్లిమర్రిలో ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తారు. 11.45కు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. 12 గంటలకు టెక్నోడోమ్ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. 12.20కి టెక్సానా మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు బుగ్గలేటిపల్లె భారత్ కాలేజి సమీప ప్రాంగణంలో కమలాపురం ఉత్తమ కార్యకర్తల సమావేశానికి హాజరవుతారు. 3 గంటలకు కమలాపురం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేశ్ పాల్గొంటారు.