- స్టేడియం ‘ఏ-గ్యాలరీ స్టాండ్’కు మిథాలిరాజ్ పేరు
- మూడో నంబర్ గేట్’కు రావి కల్పన పేరు
- స్టాండ్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన లోకేశ్
- భారత్-ఆస్ట్రేలియా మహిళల వన్డే
విశాఖపట్నం (చైతన్య రథం): విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ సందడి చేశారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరుతో ‘ఏ-గ్యాలరీ స్టాండ్’తో పాటు మరో క్రికెటర్ రావి కల్పన పేరుతో ‘మూడో నెంబర్ గేట్’ను ఐసీసీ ఛైర్మన్ జై షాతో కలిసి మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షులు మిథున్ మన్హాస్, ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ పాల్గొన్నారు. అనంతరం భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ను జై షాతో కలిసి మంత్రి నారా లోకేష్ వీక్షించారు.