ఏపీలో సెమీకండక్టర్స్ యూనిట్ ఏర్పాటుకు ఆహ్వానం
ఐవీపీ సెమీ ఫౌండర్ రాజా మాణిక్కంతోనూ భేటీ
సింగపూర్ (చైతన్య రథం): ఐవీపీ సెమి ఫౌండర్ రాజా మాణిక్కంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ సింగపూర్ షాంగ్రీలా హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో సెమీకండక్టర్ పరికరాల తయారీ కేంద్రం లేదా చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రాష్ట్ర పారిశ్రామిక క్లస్టర్‌లలో అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఐవీపీ సెమీ పర్యావరణ వ్యవస్థ- నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి సహా సరఫరాదారులుగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో తమిళనాడుకు పొరుగున ఉన్న ఏపీ ప్రాంతీయ సహకారాన్ని తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజా మాణిక్కం హామీ ఇచ్చారు.
డీటీడీఎస్ సీఈవోతో..
డీటీడీఎస్ గ్రూప్ సీఈవో బిఎస్ చక్రవర్తితో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. డీటీడీఎస్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈలకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో ప్రాంతీయ సహకారాన్ని గుర్తించి తమిళనాడుతోపాటు ఏపీ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
క్యాపిటాల్యాండ్ సీఈవోతో సమావేశం
క్యాపిటాల్యాండ్ ఇన్వెస్టిమెంట్స్ సీఈవో సంజీవ్ దాస్ గుప్తాతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. సీఎల్‌ఐ స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్‌లను వారి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తివంతం చేయవచ్చని సూచించారు. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వైజాగ్‌వంటి టైర్`2 నగరాలకు తరలివస్తున్న నేపథ్యంలో వైజాగ్, విజయవాడలో ఐటీ/ సాఫ్ట్‌వేర్ పార్కులు, మిశ్రమాభివృద్ధి నమూనాల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక గిడ్డంగులు/ పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని కోరారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనిపై సంజీవ్ దాస్ గుప్తా స్పందిస్తూ… ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.