- పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు
- కూటమిలో చిచ్చుకు వైసీపీ దుష్ప్రచారం
- ఆ పార్టీ నేతలపై అప్రమత్తంగా ఉండాలి
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ, కోటి పైగా సభత్వం తీసుకున్న కార్యకర్తల కుటుంబం తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురు వారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి, సేవకు లోకేష్ బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారు. కార్యకర్తల సంక్షేమంతో పాటు మంత్రిగా రాష్ట్రాభివృద్ధికి నిరంతరం చేస్తున్నారు. అటు అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంతో, ఇటు యువ నాయకత్వం లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. అందుకే పెద్దఎత్తున యువత లోకేష్ ఉన్నత ఆలోచనలకు ఆకర్షితులై టీడీపీ వైపు చూస్తున్నారు. యువగళం పాద యాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుని రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా కృషి చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లు అంధకారంలో ఉన్న ఏపీలో వెలు గులు నింపేందుకు పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు యువనేత చేస్తున్న కృషి ప్రశంసనీయం. గూగుల్, టీసీఎస్‌తో పాటు అనేక కంపెనీలు నేడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయంటే అది లోకేష్‌బాబు కృషి వల్లనే అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఏపీ వైపు పెట్టుబడిదారులు చూడా లంటేనే బయపడే పరిస్థితి ఉంది. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటో అని తలుచుకుని ఆందోళన చెందారంటే ఎంత విధ్వంసకర పాలన సాగిందో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కమీషన్లు ఇవ్వకుంటే రాష్ట్రంలో ఉన్న కంపెనీ లను తరిమికొట్టారు.
ఏపీకి ఉన్న బ్రాండ్‌ను పాతాళంలోకి నెట్టారు. చలికి భయపడిన అసమర్థులు గత పాలకులు. కనీసం దావోస్ వెళ్లి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయ త్నం కూడా చేయలేదని మండిపడ్డారు. టీడీపీ పార్టీ కుటుంబసభ్యుల అండతో ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో తండ్రికి తగ్గ తనయుడిగా నారా లోకేష్ ముం దుండి నడిపిస్తున్నారని ప్రశంసించారు. లోకేష్‌కు ఉన్న అపారమైన తెలివితేటలతో 15 సెకండ్లకే ఒక మెంబర్‌షిప్ చేయగలిగాం. రెండు నెలల్లోనే కోటికి పైగా సభ్యత్వం పూర్తి చేశామంటే లోకేష్ సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవాలి. నాడు స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలని కార్మికులు ప్రాధేయపడగా అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామ ని హామీ ఇచ్చారు. ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడి చంద్రబాబు నాయత్వంలో కేంద్రం నుంచి స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్లు తీసుకువచ్చారు. దీంట్లో లోకేష్ పాత్ర చాలా కీలకం. ప్యాకేజ్‌తో పాటు ప్లాంట్‌ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపిం చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. గత పాలకులు ప్లాంట్‌లో నష్టాలను చూపించి దాన్ని ప్రైవేట్‌పరం చేసేందుకు కుట్రపన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టాక కొనఊపిరితో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.1640 కోట్లు కేటాయించి ప్రాణం పోశారు. స్టీల్ ప్లాంట్‌కు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. వైసీపీ నాయకులు పార్టీల మధ్య విభేదాలను సృష్టించి కూటమికి నష్టం చేయాలని చూస్తు న్నారు. అందరూ అప్రమత్తంగా ఉండి కలిసిమెలిసి నడవాలి. సమన్వయంతో చర్చిం చి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో ఏదో మాట్లాడితే తొందరపడవద్దని సూచించారు. కూటమి పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. యువతకు భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు.