- గత ప్రభుత్వంలో పట్టించుకున్న వారు లేరు
- లోకేష్ హామీ ఇచ్చిన విధంగానే రోడ్లు నిర్మించి, ఇళ్ల పట్టాలు అందించారు
- మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో ఓ వృద్ధురాలి భావోద్వేగం
- నడవలేకపోతున్న వృద్ధురాలి వద్దకు స్వయంగా వెళ్లి ఇంటి పట్టా అందించిన మంత్రి లోకేష్
మంగళగిరి (చైతన్యరథం): మన ఇల్లు-మన లోకేష్..పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో మంగళగిరి రత్నాలచెరువుకు చెందిన అడిగొప్పల మల్లీశ్వరి అనే వృద్ధురాలు భావోద్వేగానికి గురయ్యారు. ఇంటి పట్టా అందుకునేందుకు స్టేజి వద్దకు వచ్చిన వృద్ధురాలు నడవలేకపోవడంతో స్వయంగా మంత్రి లోకేష్.. ఆమె వద్దకు వెళ్లి ఇంటి పట్టా అందించారు. పట్టా తీసుకున్న ఆమె ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు. దేవుడు చల్లగా చూడాలంటూ మంత్రి లోకేష్‌ని దీవించారు. సంతోషం ఆపుకోలేని ఆమె మాట్లాడుతూ.. దాదాపు పదేళ్ల నుంచి మంగళగిరి రత్నాలచెరువులో నివాసం ఉంటున్నాం. రహదారి సౌకర్యం, తాగునీరు లేక ఇబ్బందులు పడ్డాం. అద్దె ఇళ్లలో జీవనం సాగించాం. ఎన్నికల సమయంలో రోడ్లు నిర్మిస్తామని, పట్టాలు ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అన్నట్లుగానే రోడ్లు వేశారు, పట్టాలిచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న మాలాంటి వారికి అండగా నిలిచిన ఆయన, ఆయన కుటుంబం చల్లగా ఉండాలి. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇళ్లలోకి నీరు వచ్చినా పట్టించుకున్న వారు లేరు. రత్నాలచెరువులో నివాసం ఉంటున్న వారికి లోకేష్ చేసిన సాయం మరువలేనిదంటూ కన్నీటిపర్యంతమయ్యారు. మాట్లాడలేక భావోద్వేగానికి గురైన ఆమెను మంత్రి లోకేష్ ఓదార్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.