- సాక్షి కథనం పూర్తిగా నిరాధారం
- ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు
- గత ప్రభుత్వంలోనే అతిపెద్ద కుంభకోణం
- అరెస్టు భయంతోనే ప్రభుత్వంపై బురద
- ఖండించిన ఎక్సైజ్ శాఖ
అమరావతి(చైతన్యరథం): ప్రభుత్వం మద్యం సిండికేట్కు ప్రోత్సహించి వినియోగదారులను దోచుకోవడానికి అవకాశం కల్పి స్తోందని సాక్షి పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా నిరాధారమైనదని ఎక్సైజ్ శాఖ ఒ ప్రకటనలో ఖండించింది. 2014-19 మధ్య కాలంలో ప్రభుత్వం మద్యం లైసెన్స్ దారులకు అనుకూలం గా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిందని, అదేవిధంగా ఇప్పుడు బార్లకు ఏఆర్టీని తొలగించడానికి సిద్ధంగా ఉందననేది పూర్తిగా అబ ద్ధమని వివరించారు. ప్రివిలేజ్ ఫీజును 2015లో ఒక విధానపర మైన నిర్ణయంగా రద్దు చేశారు. మద్యం షాపుల కేటాయింపును సులభ తరం చేయడానికి, లైసెన్సారులు నిబంధనలను కచ్చి తంగా పాటించేలా చేయడానికి అనేక విధానపరమైన అంశాలను పరిశీలించి తీసుకున్న నిర్ణయం. మద్యం సిండికేట్ బార్ల అప్పగిం త ప్రక్రియను హైజాక్ చేసిందని, దరఖాస్తులు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదని, ఏఆర్ ఈటీని తొలగించాలని డిమాండ్ చేస్తోందని చెప్పడం నిజం కాదు. నిజానికి నవంబర్ 2019 వరకు బార్లు, మద్యం షాపులకు ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ ధర ఎప్పుడూ ఒకేలా ఉండేది.
2019 నవంబర్ మద్యం షాపులతో పోలిస్తే బార్ పై మూడు రెట్లు అదనంగా ఏఆర్టీ విధించారు. దీనివల్ల ఒకే రకమైన మద్యానికి వేర్వేరు ధరలు ఏర్పడ్డాయి. ఇలాంటి విధానాన్ని దేశంలో ఎక్కడా అమలు చేయలేదు. బార్లపై విధించిన ఏఆర్ టీ చాలా అధికంగా ఉందని గుర్తించి సెప్టెం బర్ 2020లో దానిని ఇష్యూ ధరలో 10 శాతానికి తగ్గించారు. అయితే మద్యం షాపులు, బార్ల మధ్య ఇన్వాయిస్ ధరలో వ్యత్యా సం కొనసాగుతూనే ఉంది. ఇది రాష్ట్ర పన్నుల విధానానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. ఈ వ్యత్యాసం మార్కెట్ను తీవ్రంగా దెబ్బ తీసిందని, ముఖ్యంగా 2019-24 మధ్యకాలంలో షాపుల నుంచి బార్లకు మద్యం అక్రమంగా తరలించడం వంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు అవకాశం కల్పించింది.
ఈ విధానాన్ని సరిదిద్ద డం, తద్వారా అక్రమ వ్యాపారాలకు అవకాశం లేకుండా షాపులు, బార్లు రెండూ సజావుగా పనిచేయడానికి ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ హెూల్సేల్ ధరలలో పారదర్శకతను పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నాం. బార్ల పాలసీ ప్రక్రియను మద్యం సిండికేట్ పూర్తిగా స్వాధీనం చేసుకుందనే ఆరోపణ పూర్తిగా నిరాధారమైనది. ఇప్పటి వరకు ఓపెన్, రిజర్వ్ కేటగిరీలలో నోటిఫై చేసిన 924 బార్లలో 625 బార్లను ప్రతి జిల్లాల కలెక్టర్లు లాటరీ నిర్వహించి గెలుపొందిన వారికి కేటాయించారు. నిజానికి 2022-25 బార్ పాలసీ ప్రకారం 1,149 దరఖాస్తులు వస్తే.. 2025-28
2,873 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు రుసుము రూపంలో కూడా ప్రస్తుత పాలసీ ద్వారా గతంలో రూ.91 కోట్లు మాత్రమే వస్తే.. ప్రస్తుత పాలసీలో రూ. 143.65 కోట్లు వచ్చాయి. ఏఆర్టీ ద్వారా సంవత్సరానికి రూ.500 కోట్లు లభిస్తోందనే ఆరోపణ కూడా నిజం కాదు. ప్రస్తుత బార్ ప్రకారం 2025-26 సంవత్సరానికి ఇది సుమారు రూ.225 కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది.
బార్లలో రూ.99 (180 ఎంఎల్) మద్యం అమ్మకాలకు అనుమ తిస్తున్నారనే ఆరోపణ కూడా పచ్చి అబద్ధం. కేబినెట్ ఉప సంఘం సమావేశంలో 2019 ప్రవేశపెట్టిన బార్ పాలసీ గురించి కీల కంగా చర్చించడం జరిగింది. ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ ఉత్పత్తుల కు అదనంగా ఏఆర్టీ(అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్) విధిం చడం గురించి, తద్వారా కలిగిన ఇబ్బందులు, మద్యం షాపుల నుంచి బార్లకు మద్యం అక్రమంగా తరలించడం వంటి అంశా లపై కూడా చర్చించారు. వాస్తవాలన్నింటినీ వక్రీకరించి సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నాం. 2019-24 మధ్య కాలంలో జరిగిన మద్యం అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడం, ప్రస్తుతం అమలు చేసిన మద్యం పాలసీకి మద్యం ప్రియుల నుంచి మంచి స్పందన రావ డంతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా సాక్షి అబద్ధాలను ప్రచురి స్తోంది. దేశ చరిత్రలోనే 2019-24 మద్య రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం అత్యంత తీవ్రమైనది.
మద్యం కుంభ కోణం పై అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుండడం, అరెస్టు తప్పదనే భయంతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు సాక్షి పత్రికలో తప్పుడు కథనాలను ప్రచురించి మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోందని తెలిపింది.