- దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా జగన్ మాటలు
- ప్రజాస్వామ్యం గురించి వైసీపీ నేతలు మాట్లాడటమా?
- దమ్ముంటే జగన్ రెడ్డి బాబాయి హత్యపై ఢల్లీిలో ధర్నాచేయాలి
- కావాలనే వైసీపీ నేతల కవ్వింపు చర్యలు
- మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపాటు
- టీడీపీ నేతలు సహనంతో ఉండాలని హితవు
అమరావతి(చైతన్యరథం): వైసీపీ నేతలకు అబద్ధాలు ఆడటం వెన్నతో పెట్టిన విద్య అని… దెయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి గుమ్మడి సంధ్యా రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆమె సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ఏ మాత్రం సిగ్గులేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ప్లకార్డులతో అసెంబ్లీ వద్ద నిరసన చేశాడని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ముందుచూపునకు, ఆయన కార్యదక్షతకు ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేమన్నారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి సోమవారం ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలన్నీ కూడా వైసీపీలో జరిగిన అరాచకాలపైనే. గత ఐదేళ్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి… రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపారు. నేడు సిగ్గులేకుండా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మాట్లాడుతున్నారు. గవర్నర్ దగ్గరకు వెళ్లి వైసీపీ నేతలు లేఖ ఇవ్వడం, రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరడం చూస్తుంటే నవ్వొస్తోంది. గురివింద గింజ తనకింద ఉన్న నలుపును చూసుకోకుండా మాట్లాడినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. దెబ్బలాటకు, కోట్లాటకు ఆద్యులు వైసీపీ నేతలే. సొంత బాబాయి చనిపోయినప్పుడు గవర్నర్ దగ్గరకు వెళ్లి జగన్ రెడ్డి ఎందుకు అర్జీ ఇవ్వలేదు? వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపి గుండెపోటు డ్రామాలు ఆడి నేడు ప్రజాస్వామ్యం గురించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని సంధ్యారాణి ధ్వజమెత్తారు.
శవం కనిపిస్తే చాలు వాలిపోతాడు
మీ చినాన్న హత్యపై సొంత చెల్లెళ్లు పోరాడుతుంటే ఎందుకు జగన్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి రోజూ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితులే ఉన్నాయి. వ్యక్తిగత కక్షలతో జరిగిన ఘర్షణలను కూడా కూటమికి ఆపాదిస్తూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో 30 వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఒక్క రోజు కూడా జగన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు. నేడు 36 మంది హత్యకు గురయ్యారని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్లు.. జగన్ రెడ్డికి శవం కనిపిస్తే బయటకు వస్తున్నాడు. ఎవరైనా చనిపోతే.. ఎలా మాట్లాడాలో కూడా జగన్ రెడ్డికి తెలియడంలేదు.. ఒక సైకోలా నవ్వుతూ బాధితుల వద్ద పథకాల గురించి మాట్లాడుతున్నాడు. విశాఖలో దళిత డాక్టర్ సుధాకర్‌ను నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచి కొట్టినప్పుడు, ఆయనపై పిచ్చివాడని ముద్ర వేసి ప్రాణాటు కోల్పోయేటా చేసినప్పుడు జగన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు. డాక్టర్ అచ్చెన్న, డాక్టర్ సుధారాణిని ఇబ్బంది పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కోడికత్తి శ్రీను, ఓం ప్రతాప్, హనుమాయమ్మ, స్నేహలత, రమ్య, వెంకాయమ్మ, కర్రి శ్రీకాంత్, జర్జి రామకృష్ణ వీళ్లెవరూ జగన్‌కు గుర్తులేదా? ఇలా ఎంతమంది మీ చేతుల్లో హతులు అయ్యారో కదా జగన్ రెడ్డి. నిజంగా జగన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటే మీ చిన్నాన్నను ఎవరు చంపారో తేల్చేందుకు సీబీఐ విచారణకు సహకరించాలి. సీబీఐ అధికారులు వస్తే బాంబులు వేస్తామన్న వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చాలా దౌర్భాగ్యమని సంధ్యారాణి దుయ్యబట్టారు.
కావాలనే వైసీపీ కవ్వింపు చర్యలు
గత ఐదేళ్లు ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. బ్రిటీష్ పాలనలో ఉన్నామా అని ప్రజలు ఆవేదనకు లోనయ్యారు. ఎప్పుడు ఈ దుర్మార్గుడి సైకో పాలన పోతుందా అని జనం ఎదురు చూశారు. 164 సీట్లతో కూటమిని గెలిపించుకున్నారు. వైసీపీ నేతల అరాచకాలను వద్దనే ప్రజలు వారి పాలనను పాతిపెట్టారు. టీడీపీ వారికి చంద్రబాబు క్రమశిక్షణ నేర్పించారు. నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే మా నాయకుడు కంటి సైగ చాలు. మేము అక్కర్లేదు… వైసీపీ నేతల చేతిలో బాధలకు గురైన కార్యకర్తలే వైసీపీ నేతలకు బుద్ధి చెబుతారు. కాని వైసీపీ నేతలు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదని.. ప్రజాస్వామ్యంగా నడుచుకోవాలని మా నాయకుడు మాకు సూచించారని సంధ్యారాణి అన్నారు.
53 రోజులు జైల్లో పెట్టి మా నాయకుడిని ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినా మా నాయకుడు హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఐదేళ్లు బయటకు రాని వ్యక్తి శవం కనిపించగానే బయటకు వచ్చాడు. ఎల్లప్పుడూ మేము పార్టీ ఆఫీసులో ప్రజలు, కార్యకర్తలకోసం అందుబాటులో ఉంటాం. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి చెప్పాలి. చట్టపరంగా ముందుకు వెళ్తాం. ఎటువంటి ఆవేశాలకు లోనుకావద్దని సంధ్యారాణి సూచించారు.
ఇది ప్రజాప్రభుత్వం: ప్రతిభా భారతి
శాసనసభ మాజీ స్పీకర్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కావలి ప్రతిభా భారతి మాట్లాడుతూ అటు రాయలసీమ నుండి ఇటు శ్రీకాకుళం వరకు ప్రజలు అర్జీలు తీసుకుని వస్తున్నారన్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత డిపార్ట్‌మెంట్ లకు పంపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు ప్రజా శ్రేయస్సును కోరుకునే వ్యక్తి.. ఆయన బాటలోనే నాయకులు కార్యాలయంలో అందుబాటులో ఉంటూ. వివిధ సమస్యలపై కార్యాలయానికి వస్తున్న ప్రతి ఆర్జీని పరిశీలించి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నాం. గత ఐదేళ్లలో జగన్ రెడ్డి ఒక్క అర్జీని కూడా తీసుకోలేదు. ఒక్క రోజు కూడా ప్రజలను కలవలేదు. బయటకు రావాలంటే పరదాలు కట్టుకున్నాడు. పోలీసుల పహారా పెట్టుకున్నాడు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రజా నాయకుడు ఎవరో ప్రజలే గమనించాలి. ప్రజా ప్రభుత్వం ఏదో ప్రజలే అర్థం చేసుకోవాలని ప్రతిభా భారతి అన్నారు.